Share News

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:10 AM

ఉగ్రవాద ప్రచారం చేస్తూ విజయవాడలో అరెస్టు అయిన నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరనున్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించిన ఉగ్ర నీడ...

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద ప్రచారం చేస్తూ విజయవాడలో అరెస్టు అయిన నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరనున్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించిన ఉగ్ర నీడ మూలాలను పసిగట్టేందుకు వీరిని విచారించాల్సిన అవసరం ఉన్నదంటూ సోమవారం పిటిషన్‌ వేయనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మందిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఐదుగురి కస్టడీ కోసం ఇప్పటికే పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. అలాగే మిగతా వారినీ కస్టడీకి కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నారు. వీరందరినీ రెండు దఫాలుగా కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అరెస్టు, విచారణ సమయంలో.. అందరూ ప్రస్తావించిన పేరు అల్‌ హకీమ్‌ షుకూర్‌. అతడు ఎవరన్నదానిపై విచారణ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన పట్నాకు చెందిన 16 ఏళ్ల బాలుణ్ణి విజయవాడ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Updated Date - Mar 29 , 2026 | 04:11 AM