Share News

‘బెనెక్స్‌’లో ఇంకెంతమంది ఉన్నారు?

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:55 AM

‘బెనెక్స్‌ కామ్‌ గ్రూపునకు ఇంకా ఎంతమంది అనుసంధానమై ఉన్నారు? వారంతా ఎక్కడున్నారు?’ అని ఉగ్ర సానుభూతిపరులను పోలీసులు ప్రశ్నించారు.

‘బెనెక్స్‌’లో ఇంకెంతమంది ఉన్నారు?

  • వారంతా ప్రస్తుతం ఎక్కడున్నారు?

  • ఉగ్ర సానుభూతిపరులను ప్రశ్నించిన పోలీసులు

విజయవాడ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘బెనెక్స్‌ కామ్‌ గ్రూపునకు ఇంకా ఎంతమంది అనుసంధానమై ఉన్నారు? వారంతా ఎక్కడున్నారు?’ అని ఉగ్ర సానుభూతిపరులను పోలీసులు ప్రశ్నించారు. ఉగ్రవాద సాహిత్యాన్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్న అజ్మతుల్లా ఖాన్‌(బిహార్‌), లక్కీ అహ్మద్‌(ఢిల్లీ), మిర్‌ ఆషిఫ్‌ అలీ(పశ్చిమ బెంగాల్‌), జిషాన్‌(రాజస్థాన్‌), షారూక్‌ ఖాన్‌(మహారాష్ట్ర), షేక్‌ ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌(మహారాష్ట్ర)లను పోలీసులు, నిఘా వర్గాల అధికారులు విచారణ చేస్తున్నారు. ఆదివారం విచారణలో ఐబీ, ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఐఏ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. బెనెక్స్‌ గ్రూపులో ఏడు రాష్ట్రాలకు చెందిన 12 మంది ఉన్నారు. వీరి ఒక్కో ఐడీకి 30-40 మంది ఐడీలు అనుసంధానమై ఉన్నాయని గుర్తించారు. వారంతా ప్రస్తుతం ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న వివరాలను అధికారులు రాబట్టారు. మొత్తంగా బెనెక్స్‌ కామ్‌తో లింక్‌ అయిన ఐడీలకు సంబంధించిన వాళ్లందరినీ అదుపులోకి తీసుకునే యోచనలో నిఘా వర్గాలు ఉన్నాయి.

Updated Date - Apr 13 , 2026 | 06:55 AM