DGP Harish Kumar Gupta: మారుమూల ప్రాంతాలకూ పోలీసు కమ్యూనికేషన్
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:40 AM
రాష్ట్రంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు సైతం పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరించి, వేగవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ కృషి...
విపత్తుల్లో వేగంగా మెరుగైన సేవలు: డీజీపీ హరీశ్‌గుప్తా
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు సైతం పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరించి, వేగవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. సెల్‌ఫోన్ సిగ్నళ్లు అందని అటవీ ప్రాంతాల్లో నూ పోలీసు కమ్యూనికేషన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా సకాలంలో సమాచారం అందించడం ద్వారా ప్రజల రక్షణతో పాటు విపత్తుల సమయంలో పోలీసుల సేవలు మరింత మెరుగవుతాయన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ కేంద్ర హోంశాఖ నిధులతో రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ మెరుగుదల(రేస్) కింద రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు 8 కార్లు, 16 బైకులను డీజీపీ చేతుల మీదుగా అందజేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తా ఈ వాహనాలకు పచ్చజెండా ఊపారు.