Share News

అంబటి ఆత్రం!

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:30 AM

‘ఇదిగో సాయికృష్ణ మృతదేహం! కృష్ణలంక పోలీసులు చంపేశారు’ అంటూ వైసీపీ చేసింది ఫేక్‌ ప్రచారమని తేలింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు రోజుల క్రితం..

అంబటి ఆత్రం!

  • ఆయన చూపిన ఫొటోలు సాయికృష్ణవి కావు

  • సాయి చేతిలో చనిపోయిన నవీన్‌వి: పోలీసులు

ఇంటర్నెట్ డెస్క్: ‘ఇదిగో సాయికృష్ణ మృతదేహం! కృష్ణలంక పోలీసులు చంపేశారు’ అంటూ వైసీపీ చేసింది ఫేక్‌ ప్రచారమని తేలింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి మృతదేహం బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు విడుదల చేసి... అతనే సాయికృష్ణ అన్నారు. నిజానికి... ఆ ఫొటోలో ఉన్నది సాయికృష్ణ చేతిలో చనిపోయినట్లుగా అనుమానిస్తున్న నవీన్‌ రెడ్డి కావడం గమనార్హం. అతనిపై విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్ లో క్రైం సస్పెక్ట్‌ షీటు ఉంది. పోలీసులు చెబుతున్న ప్రకారం... సాయికృష్ణ, నవీన్‌ మధ్య జైల్లో పరిచయం ఏర్పడింది. గతేడాది డిసెంబరు 4న సాయికృష్ణ, నవీన్‌ మధ్య సెల్‌ఫోన్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో సాయికృష్ణ బీరు సీసా పగలగొట్టి నవీన్‌ మెడ, ఛాతీ భాగం లో పొడిచాడు. నవీన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. వైసీపీ నేతలు చూపిస్తున్న ఫొటోలు సాయికృష్ణవి కాదని... నవీన్‌వని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 04:32 AM