Share News

చలో ముచ్చుమర్రిని అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:23 PM

ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని వైసీపీ నాయకులు చేపట్టిన చలో ముచ్చుమర్రి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

   చలో ముచ్చుమర్రిని అడ్డుకున్న పోలీసులు
ముచ్చుమర్రి సమీపంలో వైసీపీ నాయకులను అడుకున్న పోలీస్‌లు

రోడ్డుపై భైఠాయించిన వైసీపీ నాయకులు

స్టేషనకు తరలించిన పోలీసులు

్ఞ్ఞ్ఞపగిడ్యాల,ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని వైసీపీ నాయకులు చేపట్టిన చలో ముచ్చుమర్రి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దారా సుదీర్‌, మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు ముచ్చుమర్రికి ఎత్తిపోతల వద్దకు వెళుతుండగా నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదని చెప్పడంతో వైసీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతు సమస్యలపై చేపట్టిన కార్యక్రమానికి అనుమతి లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిరసనగా రోడ్డు మీద భైఠాయించి ఆందోళనకు దిగరు. పోలీసులు వారిని స్టేషనకు తరలించారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసన చేపట్టిన వైసీపీ సమన్వయకర్త దారా సుధీర్‌తో పాటు 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.

Updated Date - Aug 05 , 2026 | 11:23 PM