Share News

అది ‘పోలీసు’ పొరపాటే

ABN , Publish Date - May 23 , 2026 | 06:04 AM

ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌పై నమోదైన కేసు విషయంలో దర్యాప్తు ప్రక్రియను కాకినాడ జిల్లా పెద్దాపు రం పోలీసులు వేగవంతం చేశారు

అది ‘పోలీసు’ పొరపాటే

  • రాధామనోహర్‌ దాస్‌ కేసులో కీలక మలుపు

  • వాస్తవాలు నిర్ధారించుకోకుండా పోలీసు ఫిర్యాదు

  • దాని ఆధారంగానే హిందూ ప్రచారకుడిపై కేసు

  • తప్పు తమవైపే జరిగినట్టు పోలీసుల నిర్ధారణ!

పెద్దాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌పై నమోదైన కేసు విషయంలో దర్యాప్తు ప్రక్రియను కాకినాడ జిల్లా పెద్దాపు రం పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ (వాస్తవాల నిర్ధారణలో పొరపాటు) కోణంలో విశ్లేషిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించారు. ఈనెల 12న కాకినాడ జిల్లా పెద్దాపురం మెయిన్‌రోడ్డులో జరిగిన హనుమాన్‌ శోభాయాత్రలో రాధా మనోహర్‌ దాస్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ వాసంశెట్టి శేషరావు ఫిర్యాదు చేయడంతో దాస్‌పై కేసు నమోదైంది.అయితే, ప్రాథమిక విచారణలో రాధామనోహర్‌ దాస్‌ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి నేరానికీ పాల్పడలేదని తెలుస్తోంది. శోభాయాత్ర కార్యక్రమం జరిగిన తీరును సరిగ్గా అర్థం చేసుకోకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా దాస్‌పై కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేసినట్టు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహా మేరకు ఈ కేసులో చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 23 , 2026 | 06:05 AM