Share News

CM Chandrababu: నల్లమలసాగర్‌తో ఎవరికీ నష్టం లేదు

ABN , Publish Date - Jan 13 , 2026 | 05:25 AM

నల్లమలసాగర్‌ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టంలేదని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సచివాలయంలో కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశంలో మాట్లాడారు. ‘కాళేశ్వరం ఎగువన ఉంది.

CM Chandrababu: నల్లమలసాగర్‌తో ఎవరికీ నష్టం లేదు

  • దిగువన ఉన్న జలాలను వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం?

  • కాళేశ్వరం కట్టినప్పుడు మేం అభ్యంతరం చెప్పలేదు: బాబు

  • కాళేశ్వరంలాగే కేంద్రం దీనికీ అనుమతివ్వాలి: నిమ్మల

నల్లమలసాగర్‌ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టంలేదని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సచివాలయంలో కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశంలో మాట్లాడారు. ‘కాళేశ్వరం ఎగువన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాజెక్టు కడితే మేం అభ్యంతరం చెప్పలేదు. మిగులు జలాలు ఉన్నాయన్న ఉద్దేశంతో వదిలేశాం. ఇప్పుడు కట్టే ప్రాజెక్టు దిగువ నీటికి సంబంధించినది. ఎగువన తెలంగాణ వాడుకున్న తర్వాతే నీళ్లు కిందకు వస్తాయి. అవసరమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి నీటిని తెలంగా ణ, రాయలసీమ వినియోగించుకోవచ్చు. దిగువ నీటిని ఏపీ వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం? 87శాతం పోలవరం పనులు పూర్తయ్యాయి. 2026 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం’ అని తెలిపారు.

కాళేశ్వరంలాగే కేంద్రం దీనికీ అనుమతివ్వాలి: నిమ్మల

పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో ఎవరికీ నష్టం ఉండదని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను తెలంగాణ సో మవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన మాట్లాడా రు. ‘ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మొదటి నుంచీ మేం కోరుకుంటున్నాం. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం. అపోహలు విడనాడి ఇప్పటికైనా సహకరించాలని కోరుతున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష. గత 50 ఏళ్లలో గోదావరిలో లక్షా 53వేల టీఎంసీలు వృధాగా కడలిపాలయ్యాయి. ఈ ఏడాది కూడా 4,600 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి. రాష్ట్ర విభజన తర్వాత గోదావ రి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా అనుమతి ఇచ్చా రో.. నల్లమలసాగర్‌కూ అదేవిధంగా అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. పోలవరం దగ్గర వరద నీటిని ఏపీయే ఉపయోగించుకోవాలి. లేదంటే సముద్రంలో ఉప్పునీటిలో కలిసిపోతుంది. అలాంటప్పుడు తెలంగాణకు నష్టం జరిగే ప్రశ్నే లేదు.’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 13 , 2026 | 05:25 AM