Share News

నేడు పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:22 AM

పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు.

నేడు పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాల తరలింపుతో సహా 35 ప్రాధాన్య ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు.

Updated Date - Aug 14 , 2026 | 05:24 AM