Share News

టూరిజం హబ్‌గా పోలవరం ప్రాజెక్టు

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:22 AM

పోలవరం ప్రాజెక్టుకు సొబగులు అద్ది టూరిజం హబ్‌గా తయారు చేయాలని జల వనరుల శాఖను మం త్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

టూరిజం హబ్‌గా పోలవరం ప్రాజెక్టు

  • స్పిల్‌వే అలంకరణకు డిజైన్ల తయారీకి ఆదేశం

  • గోదావరి పుష్కరాలకు పనులు పూర్తి కావాల్సిందే

  • రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరులను కలుపుతూ ఎన్‌హెచ్‌తో అనుసంధానం చేయాలి

  • అధికారులతో మంత్రి నిమ్మల

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు సొబగులు అద్ది టూరిజం హబ్‌గా తయారు చేయాలని జల వనరుల శాఖను మం త్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదిరులతో నిమ్మల సమీక్షించారు. 2027లో గోదావరి పుష్కరాలలోపు ప్ర ధాన డ్యామ్‌ పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు స్పిల్‌వేను అలంకరించేందుకు డిజైన్లు తయారు చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాజమండ్రి, ఏలూరు, కొవ్వూరును కలుపుతూ జాతీయ రహదారితో అనుసంధానించాలని సూచించారు. స్పిల్‌వేకి దిగువన బ్రిడ్జి నిర్మా ణ పనులకు సంబంధించిన డిజైన్లకు అనుమతు లు, ఇతర పనుల కోసం షెడ్యూల్‌ ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనుల్లో గ్యాప్‌- 1లో 45ు, గ్యాప్‌-2లో 22ు పనులు పూర్తయ్యాయన్నారు.

పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపుపై అధ్యయనం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పరిసర మండలాల్లో ముంపు ఏ మేరకు ఉంటుందన్న అంశంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, నీటి పారుదల శాఖ అధికారుల బృందం అధ్యయనం చేసింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ(పీపీఏ) సీఈవో సంజీవ్‌వోరా, మెంబర్‌ సెక్రటరీ(ఎంఎస్‌) రఘురాం, సీఈ ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ రమేష్‌, డైరెక్టర్‌ సతీష్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ప్రవీణ్‌, రవి, తెలంగాణ నీటి పారుదల శాఖ భద్రాచలం ఈఈ ఎస్‌కే జానీ తదితర అధికారులతో కూడిన బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ముందుగా కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో పర్యటించిన బృందం గోదావరి వరద ముంపు గ్రామాలైన బూర్గంపాడు, నాగినేనిప్రోలులోని పలు ప్రాంతాలను పరిశీలించింది. ఈ సమయంలో నీటి పారుదలశాఖ అధికారులు కిన్నెరసాని, ముర్రేడు వాగులు వరదల సమయంలో ఎగపోటుతో ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jun 04 , 2026 | 04:22 AM