రాజమహేంద్రవరానికి మకాం మార్చండి
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:26 AM
పోలవరం ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. రోజువారీ పనుల సమీక్ష అవసరం. హైదరాబాద్ నుంచి తక్షణమే రాజమహేంద్రవరం మకారం మార్చండి...
పీపీఏని ఆదేశించిన కేంద్ర జల సంఘం
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ‘పోలవరం ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. రోజువారీ పనుల సమీక్ష అవసరం. హైదరాబాద్ నుంచి తక్షణమే రాజమహేంద్రవరం మకారం మార్చండి’ అంటూ కేంద్ర జల సంఘం ఆదేశించింది. ఈమేరకు జల సంఘం డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మంగళవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) చీఫ్ ఇంజనీరుకు లేఖ పంపారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కీలకమైన ఈ సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో నేరుగా పనులను పర్యవేక్షిస్తే సమాచారాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యుసీ ఆదేశాలు వెలువడడంపై జల వనరుల శాఖ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.