పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి సంతృప్తికరం
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:13 AM
పోలవరం ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరమని ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) యోగేశ్ పైఠాన్కర్ పేర్కొన్నారు. పోలవరం ప్రధాన డ్యాం పనుల్లో...
ప్రాజెక్టు అథారిటీ సీఈవో యోగేశ్ పైఠాన్కర్
పోలవరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరమని ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) యోగేశ్ పైఠాన్కర్ పేర్కొన్నారు. పోలవరం ప్రధాన డ్యాం పనుల్లో గ్యాప్ 1,2 పనులు, ఎర్త్‌కం రాక్ ఫిల్ డ్యాం పనులను శనివారం ఆయన పరిశీలించారు. వాటి నిర్మాణ పురోగతి వివరాలను సంబంధిత అధికారులను, మేఘా కాంట్రాక్టు ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయన్నారు. దీనికి అనుగుణంగా జలవనరుల శాఖ అధికారులు నిర్థిష్ట ప్రణాళికలు రూపొందించుకుని పనులు వేగవంతం చేయాలన్నారు.