Share News

పోలవరం పనులు సంతృప్తికరం

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:08 AM

పోలవరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌ పి.దోర్జి గ్యాంబా అన్నారు.

పోలవరం పనులు సంతృప్తికరం

  • ప్రాజెక్టు ప్రాంతంలో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ పర్యటన

పోలవరం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌ పి.దోర్జి గ్యాంబా అన్నారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయనకు తొలుత ప్రాజెక్టు అతిథి గృహం వద్ద పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్‌ వోహ్రా, డిప్యూటీ డైరెక్టర్‌ రవి, ఎస్‌ఈ రామచంద్రరావు, ఈఈలు డి.శ్రీనివాస్‌, కె.బాలకృష్ణ, పివెంకటరమణ, డీఈఈలు శ్రీకాంత్‌, మాధవరావు, మేఘా జీఎం గంగాధర్‌, మురళి పమ్మి స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు సమావేశమయ్యాక ఆయన ప్రాజెక్టులో స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌ 1, 2 ప్రాంతాలను పరిశీలించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Updated Date - Apr 15 , 2026 | 05:09 AM