పోలవరానికి 1301 కోట్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:37 AM
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మరో రూ.1301.61 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్...
నేరుగా ప్రాజెక్టు ఖాతాలోకి నిధులు
రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేంద్రం
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మరో రూ.1301.61 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కులదీప్ కుమార్ సింగ్.. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్‌కు మంగళవారం లేఖ రాశారు. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అకౌంట్‌లోకి నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నిర్వాసితులకు సహాయ పునరావాసం, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల కోసం రూ.1508 కోట్లను తక్షణం మంజూరు చేయాలని ఇటీవల జల వనరులశాఖ కేంద్రాన్ని కోరింది. జలశక్తి శాఖ పూర్తిస్థాయిలో సమీక్షించి రూ.1301.61 కోట్లను విడుదల చేస్తున్నట్టు రాష్ట్రానికి సమాచారం పంపింది. ఈ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ(ఎ్‌సఎన్‌ఏ) ద్వారా మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.