డయాఫ్రం వాల్ నాణ్యత సంతృప్తికరం
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:22 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరమని కేంద్ర మట్టి, రాతి పదార్థాల పరిశోధన...
సీఎస్ఎంఆర్‌ఎస్ వెల్లడి.. పోలవరం సందర్శన
పోలవరం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరమని కేంద్ర మట్టి, రాతి పదార్థాల పరిశోధన సంస్థ(సీఎస్ఎంఆర్‌ఎస్) నిపుణులు లలిత్ కుమార్ సోలంకి, హనుమాన్ ప్రసాద్ మీనా అన్నారు. బుధవారం వీరు ప్రాజెక్టులో రాతి నిర్మాణాలను, డయాఫ్రం వాల్ గ్యాప్-2 నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ బృందం 19 వరకూ ప్రాజెక్టు మొత్తం పర్యటిస్తుంది. ఇతర నిర్మాణాల్లో రాతి నాణ్యతపై పరీక్షలు నిర్వహించనుంది.