Share News

పోలవరం పనులు సంతృప్తికరం

ABN , Publish Date - May 28 , 2026 | 05:07 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించి, సూచనలు సలహాలు....

పోలవరం పనులు సంతృప్తికరం

  • నాణ్యతతో.. ప్రణాళికాబద్ధంగా, నిర్ణీత వ్యవధిలో పనులు: విదేశీ నిపుణులు

పోలవరం, మే 27(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించి, సూచనలు సలహాలు ఇవ్వడానికి నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృంద సభ్యులైన కెనడాకు చెందిన సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ బుధవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ వారికి స్వాగతం పలికారు. ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, డయాఫ్రంవాల్‌ ప్రాంతాలను పరిశీలించిన విదేశీ బృందం.. నాణ్యతా లోపం లేకుండా, ప్రణాళికాబద్ధంగా, నిర్ణీత కాల వ్యవధిలో పనులు జరుగుతున్నాయని పేర్కొంది. అనంతరం అధికారులతో సమీక్షించింది. ఎస్‌ఈ రామచంద్రరావు డయాఫ్రంవాల్‌ పనులు, ఇతర పనుల తీరుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. గతంలో తామిచ్చిన సూచనలు సలహాల మేరకు పనులు వేగవంతంగా, సంతృప్తికరంగా చేయడం గొప్ప విషయమని నిపుణుల బృందం చెప్పింది. ఈ బృందం మరో రెండు రోజులు ప్రాజెక్టులో పర్యటించనుంది.

రెండో రోజూ రాతి, మట్టి నాణ్యత పరీక్షలు

పోలవరం ప్రాజెక్టులో సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ పరీక్షలు రెండోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. ఈ సంస్థ నిపుణు ల బృందం బుధవారం గ్యాప్‌-2 ప్రాంతంలో వాడిన మట్టిలో తేమ పటుత్వ శాతాన్ని పరీక్షించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భవిష్యత్‌ అవసరాల కోసం వినియోగించే మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు.

Updated Date - May 28 , 2026 | 05:07 AM