Share News

2027 జూలై నుంచి పోలవరంలో విద్యుదుత్పత్తి

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:50 AM

పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి, 2027 జూన్‌-జూలై నాటికి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

2027 జూలై నుంచి పోలవరంలో విద్యుదుత్పత్తి

  • శరవేగంగా విద్యుత్తు ప్రాజెక్టు పనులు: సీఎస్‌ విజయానంద్‌

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి, 2027 జూన్‌-జూలై నాటికి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం విద్యుత్తు రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని, మొత్తం 12 యూనిట్లలో 6-7 యూనిట్లు 2027 జూలై నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, మిగతా యూనిట్ల పనులు 2028 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Updated Date - Feb 11 , 2026 | 03:50 AM