పోలవరం తొలిదశ పనులు 15 నాటికి పూర్తికావాల్సిందే
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:24 AM
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు వచ్చే నెల 15వ తేదీనాటికి పూర్తికావాల్సిందేనని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రత్యేక సీఎస్ శశిభూషణ్ ఆదేశం
22న ప్రాధాన్య ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు వచ్చే నెల 15వ తేదీనాటికి పూర్తికావాల్సిందేనని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 22వ తేదీన ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం వెలగపూడి సచివాలయం నుంచి శశిభూషణ్ హైబ్రిడ్ విధానంలో అధికారులతో చర్చించారు. ఈ ఏడాదే జంట సొరంగాలు పూర్తవ్వాలని.. ఎడమ హెడ్ రెగ్యులేటర్, కేఎల్ బండ్ పనులు కూడా ముగించాలని సూచించారు. తొలిదశలో ఈసీఆర్‌ఎఫ్ డ్యాం, ఎడమ ప్రధాన కాలువ తప్ప మిగిలిన పనులన్నీ వచ్చేనెల 15 నాటికి పూర్తి కావలసిందేనని అధికారులకు స్పెషల్ సీఎస్ స్పష్టంచేశారు.