పోలవరం నిర్వాసితులకు ఉగాది కానుక
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:59 AM
పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు.
వారి ఖాతాల్లో నేడు రూ.250 కోట్లు జమ
అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. భూసేకరణ, సహాయ పునరావాసంలో భాగంగా బుధవారం వారి ఖాతాల్లో రూ.250 కోట్లు జమ చేయనున్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కొందరు నిర్వాసితులకు ఆయన లాంఛనంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళి సందర్భంగా రూ.1,000 కోట్లు నిర్వాసితులకు చెల్లించిన సంగతి తెలిసిందే. 2016లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వారికి రూ.700 కోట్లు ఇచ్చారు. 2019-24 మధ్య జగన్ హయాంలో రూపాయి కూడా చెల్లించలేదు.