పోలవరంలో వినియోగిస్తున్న మట్టి, రాళ్లు భేష్
ABN , Publish Date - May 27 , 2026 | 05:54 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, రాయి నాణ్యమైనదేనని సెంట్రల్ సాయిల్-మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్‌ఎస్) నిపుణుల బృందం స్పష్టం చేసింది.
సీఎస్ఎంఆర్‌ఎస్ నిపుణుల ప్రశంస
ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-1లో నాణ్యతా పరీక్షలు
పోలవరం, మే 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, రాయి నాణ్యమైనదేనని సెంట్రల్ సాయిల్-మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్‌ఎస్) నిపుణుల బృందం స్పష్టం చేసింది. నిపుణులు సిద్ధార్ద్ పి హెడావు, శ్రీహరి టి నాయర్, గౌరవ్ పాండే మంగళవారం ప్రాజెక్టులోని గ్యాప్-1 ప్రాంతంలో పర్యటించి.. అక్కడ నిర్మాణానికి వాడుతున్న మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలకు ఏడు రకాల పరీక్షలు నిర్వహించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం ప్రాంతంలో కోర్ కట్టర్ పద్ధతిలో మట్టి పరీక్షలను, వాటర్ రీ ప్లేస్‌మెంట్ పద్ధతిలో కోర్సు రింగు టెస్టులు చేపట్టారు. వాటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఇదే తరహాలో గ్యాప్ 2 ప్రాంతంలో పరీక్షలు నిర్వహించనున్నారు.