రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం-రాహత్’ అండ
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:46 AM
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదు రహిత వైద్య సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం-రాహత్’ పథకాన్ని, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అమలు చేయడానికి...
687 ఆస్పత్రుల్లో వైద్య సేవలు: మంత్రి సత్యకుమార్
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదు రహిత వైద్య సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం-రాహత్’ పథకాన్ని, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అమలు చేయడానికి అవసరమైన చర్యలు పూర్తి కావొచ్చాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు గోల్డెన్ అవర్‌లో రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం రాహత్ పథకాన్ని ట్రస్టు అనుబంధ గుర్తింపు పొందిన ఆర్థో, పాలీట్రామా సేవలు అందుబాటులో ఉన్న 687 నెట్‌వర్క్, 17 ప్రభుత్వాసుపత్రుల్లో అమలు చేస్తున్నామని చెప్పారు.