ప్రజలందరికీ అందుబాటులో పీఎం వాణి: పెమ్మసాని
ABN , Publish Date - May 27 , 2026 | 06:13 AM
ప్రజలకు ఇంటర్నెట్‌ను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) సేవల్లో కీలక మార్పులు చేపట్టింది.
న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇంటర్నెట్‌ను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) సేవల్లో కీలక మార్పులు చేపట్టింది. ల్యాప్‌టా్‌పలు, ఇతర పరికరాల్లో వైఫైను ఉపయోగించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ పద్థతిని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా 15, 30, 60 నిమిషాల కాలపరిమితి గల చిన్న వైఫై ప్లాన్లను ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారుల ఇటీవల విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలందరికీ పబ్లిక్ వైఫై ేసవలను అందించడానికి పీఎం వాణి మనకున్న అద్భుతమైన వేదిక. ఇప్పుడు దీని వాడకాన్ని మరింత సులభం చేస్తున్నాం’ అని మంత్రి పెమ్మసాని తెలిపారు.