PM Shri Scheme: విద్యాప్రమాణాలే పీఎంశ్రీ లక్ష్యం
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:09 AM
కేంద్ర ప్రాయోజిత పీఎం శ్రీ (ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను...
రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోదీ 50వ వీడియో కాన్ఫరెన్సు
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రాయోజిత పీఎం శ్రీ (ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. వివిధ జాతీయ ప్రాజెక్టులు, పీఎం శ్రీ తదితర అంశాలకు సంబంధించి బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతికి సంబంధించి 50వ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధా ని మోడీ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, జాతీయ విద్యా పాలసీ-2020కి అనుగుణంగా నమూనా పాఠశాలలుగా తీర్చిదిద్దడం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం.. పీఎం శ్రీ ప్రధాన లక్ష్యం.’ అని మోదీ వివరించారు.
రాష్ట్రంలో 935 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక : సీఎస్
అనంతరం, ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద 935 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక కాగా వాటిని అన్ని విధాలా మెరుగైన రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన, డిజిటల్ సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తామని తెలిపారు.