ఆప్తమిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు: మోదీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:32 AM
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్ర సీఎం, కృషీవలుడు, నాకు మంచి మిత్రుడు...
చంద్రబాబుకు విషెస్ చెప్పిన కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలు
న్యూఢిల్లీ, అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్ర సీఎం, కృషీవలుడు, నాకు మంచి మిత్రుడు... చంద్రబాబుకు నా శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజా సేవలో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ... ‘ఽమీ నాయకత్వంలో ఏపీ వికసిత భారత్ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది’ అని పేర్కొన్నారు.