Share News

పవన్‌ త్వరగా కోలుకోవాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:39 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

పవన్‌ త్వరగా కోలుకోవాలి

  • ఫోన్‌లో ప్రధాని మోదీ పరామర్శ

న్యూఢిల్లీ/అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ.. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సైనస్‌ సర్జరీ చేయించుకున్న పవన్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని ఫోన్‌ చేసినందుకు ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మోదీ సమయం కేటాయించి మాట్లాడి , తాను త్వరగా కోలుకోవాలని కోరినందుకు కృతజ్ఞుడనై ఉంటానన్నారు. ప్రధాని మోదీ నిరంతర మార్గదర్శకత్వం, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 04:40 AM