Share News

ఉక్కు ప్రమాదంపై ప్రధాని, సీఎం దిగ్ర్భాంతి

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:33 AM

విశాఖపట్నం ఉక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.

ఉక్కు ప్రమాదంపై ప్రధాని, సీఎం దిగ్ర్భాంతి

  • సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం

  • నేడు విశాఖకు పవన్‌, లోకేశ్‌

న్యూఢిల్లీ, అమరావతి, భీమవరం టౌన్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఉక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక అధికారులు బాధితులకు అన్నివిధాలా సహాయాన్ని అందిస్తున్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామ’ని ప్రధాని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి.. వివరాలు ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రమాదంలో కార్మికులు మృతి చెందటం తీరని విషాదమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మంత్రి లోకేశ్‌ మంగళవారం విశాఖ చేరుకుని, స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు. బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు.

Updated Date - Jun 09 , 2026 | 04:36 AM