Share News

13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:56 AM

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) 22వ విడత నిధులను ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) 22వ విడత నిధులను ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను రైతుల ఖాతాలకు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అదేరోజు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల్ని కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - Mar 11 , 2026 | 05:58 AM