ముందస్తు వ్యవసాయ ప్రణాళిక మేలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:05 AM
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం...
ఎల్‌నినో ప్రభావంపై రంగా వర్సిటీ వీసీ
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి శారద జయలక్ష్మిదేవి సూచించారు. ఈమేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన చేశారు. ‘ప్రపంచ వాతావరణ వ్యవస్థలో మార్పుల కారణంగా 2026లో దేశంలోని రుతుపవనాల వర్షపాతం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు భాగాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే, కొంతవరకు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోవచ్చు’ అని వీసీ పేర్కొన్నారు.