పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:05 AM
వైసీపీ నేతలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది.
మాచర్ల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గతేడాది మే 24న జరిగిన టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జెవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఏ6), పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి(ఏ7), పిన్నెల్లి వెంకటరెడ్డి(ఏ8)గా ఉన్నారు. వీరిలో వెంకటరెడ్డి గతేడాది డిసెంబరు 1న, మిగిలిన ఇద్దరు డిసెంబరు 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. బెయిల్ కోసం వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం గురజాలలోని పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయాధికారి జి.ప్రియదర్శిని ఆదేశాలు ఇచ్చారు.