Share News

పిల్లర్లు వేశారు.. పనులు నిలిపివేశారు

ABN , Publish Date - May 14 , 2026 | 11:47 PM

మండలంలోని బుడుమూరు గ్రామ సచివాలయం పరిధిలో గల విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మాణం పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయింది.

పిల్లర్లు వేశారు.. పనులు నిలిపివేశారు
బుడుమూరులో నిలిచిపోయిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం పనులు:

లావేరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బుడుమూరు గ్రామ సచివాలయం పరిధిలో గల విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మాణం పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయింది. ఇక్కడ ఈ భవన నిర్మాణానికి పునాదులు, పిల్లర్లు వేసి ఆరేళ్లు గడుస్తున్నాయి. గతంలో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆరోగ్య ఉపకేంద్రం, సామాజిక భవనం ఉండేవి. వాటిని కూల్చివేసి విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవనం పనులు ప్రారంభించారు. అప్పట్లో రూ. ఆరు లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ తరువాత పటించుకోక పోవ డంతో పనులు అసంపూర్తిగా పనులు నిలిచిపోయాయి. కాగా ఈ పనులు త్వరలో పారంభిస్తామని పీఆర్‌ ఏఈ శ్రీవల్లి తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 11:47 PM