Share News

పూలే సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:38 PM

మహాత్మా జ్యోతిబాపూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని బీసీ ఫెడరేషన రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు అన్నారు.

పూలే సేవలు చిరస్మరణీయం

ఆదోని అగ్రికల్చర్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి) : మహాత్మా జ్యోతిబాపూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని బీసీ ఫెడరేషన రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు అన్నారు. శనివారం పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబా పూలే కుల వివక్ష అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయిబాబా, నాయకులు మరియాని చెన్నబసప్ప, దేవిశెట్టి ప్రకాష్‌, కత్తి హనుమంతరావు, హరికృష్ణ, రాజేశ్వరరావు, జవరాముడు, వీరభద్ర, హరికృష్ణ, మలకేశ్వరరప్ప, రంగస్వామి పాల్గొన్నారు.

ఆలూరు రూరల్‌ (హొళగుంద): జ్యోతిరావుపూలే ఆశయాల సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు చిన్నహ్యాట శేషగిరి, టీడీపీ మండల కన్వీనర్‌ రాజాపంపన్నగౌడ్‌ అన్నారు. శనివారం పూలే వర్ధంతి సందర్భంగా హొళగుందలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమాజ, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో హొళగుంద సర్పంచ్‌ తిప్పేస్వామి, మురళి, సింగిల్‌విండో సభ్యుడు దుర్గప్ప, ఎంపీటీసీ అబ్దుల్‌సుభాన్‌, తోక వెంకటేష్‌, చిన్నహ్యాట అశోక్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:38 PM