41 స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:04 AM
రాష్ట్రంలోని 41 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫొటో ఓటర్ల జాబితాల ప్రక్రియ పూర్తయింది. పట్టణ స్థానిక సంస్థల కమిషనర్ల నుంచి అందిన నివేదికల ప్రకారం 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో...
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 41 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫొటో ఓటర్ల జాబితాల ప్రక్రియ పూర్తయింది. పట్టణ స్థానిక సంస్థల కమిషనర్ల నుంచి అందిన నివేదికల ప్రకారం 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాలను ప్రచురించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. వీజీఎంసీలో 120 వార్డులు, ఏలూరు 62, మచిలీపట్నం 60, విజయవాడ 66, గుంటూరు 76, ఒం గోలు 62, నెల్లూరు 72, తిరుపతి 66, చిత్తూరు 60, కడప 66, అనంతపురం 62, కర్నూలు 68 వార్డులున్నాయి. అదే విధంగా పార్వతీపురం, నర్సీపట్నం, పిఠాపురం, రామచంద్రాపురం, పెడన, జగ్గయ్యపే ట, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, చీరాల, మార్కాపురం, తిరుపతి జిల్లాల్లోని పలు పట్టణ స్థానికసంస్థల్లో జాబితాలు ప్రచురించారు. అలాగే, చిత్తూరు, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల తదితర జిల్లాల్లోని 29 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించినట్టు ఈసీ తెలిపింది.