Share News

సామాన్యుడిపై ‘ధరల’ భారం

ABN , Publish Date - May 26 , 2026 | 04:49 AM

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. సోమవారం పెరిగిన ధరలకు పన్నులు, రవాణా ఖర్చులు కలిపితే..

సామాన్యుడిపై ‘ధరల’ భారం

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. సోమవారం పెరిగిన ధరలకు పన్నులు, రవాణా ఖర్చులు కలిపితే.. విజయవాడలో పెట్రోలు లీటరు రూ.117.25, డీజిల్‌ రూ.104.96కు చేరింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఆయిల్‌ ధరలు పెరిగిపోవడంతో రాష్ట్రంలోని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 7-8 రూపాయల వరకు పెరిగింది.

విజయవాడలో ధరలు ఇలా..

పెట్రోల్‌: పాత ధర: రూ.114.40, కొత్త ధర: రూ.117.25, పెంపు: రూ.2.85

డీజిల్‌: పాత ధర: రూ.102.13, కొత్త ధర: రూ.104.96, పెంపు: రూ.2.83

Updated Date - May 26 , 2026 | 04:49 AM