Share News

పేర్ని నానిపై కేసు వివరాలు సమర్పించండి!

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:08 AM

సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అవమానకరంగా దూషించాననే ఆరోపణలతో తనపై మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసులు నమోదు...

పేర్ని నానిపై కేసు వివరాలు సమర్పించండి!

  • ఇనగుదురుపేట పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అవమానకరంగా దూషించాననే ఆరోపణలతో తనపై మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత పేర్ని నాని వేసిన క్వాష్‌ పిటిషన్‌ శనివారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఆదేశించారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేశారంటూ సీఎం, డిప్యూటీ సీఎంను దూషించడంతోపాటు అవమానకరంగా మాట్లాడారని టీడీపీ నాయకుడు పిప్పళ్ల కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 27న మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు పేర్ని వెంకటరామయ్య(నాని)పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పేర్ని నాని శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Feb 01 , 2026 | 05:09 AM