మేం తెగిస్తే ఎందాకైనా వెళతాం!
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:28 AM
‘‘పోలీసింగ్‌ను పక్కన పెట్టి రండి చూసుకుందాం. మేం తెగిస్తే ఎందాకైనా వెళ తాం. మా ఫేస్‌బుక్‌లు దొంగతనంగా చూస్తా రా?’’ అంటూ వైసీపీ నేతలు...
తేల్చుకుందాం రమ్మంటూ పోలీసులకు పేర్ని, అనిల్ సవాళ్లు
విజయవాడ(ఇబ్రహీంపట్నం), ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలీసింగ్‌ను పక్కన పెట్టి రండి చూసుకుందాం. మేం తెగిస్తే ఎందాకైనా వెళ తాం. మా ఫేస్‌బుక్‌లు దొంగతనంగా చూస్తా రా?’’ అంటూ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్‌లు పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘తేల్చుకుందాం రండి..’ అంటూ సవాళ్లురువ్వారు. మంగళవారం విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఘటన సమయంలో ఎందుకు ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. లాఠీచార్జి ఎందుకు చేయలేదు. 2029.. టీడీపీ ఎక్స్‌పైరీ డేట్. అప్పట్లోగా ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఆ తర్వాత అంతకన్నా బలమైన దాడులు ఖాయం’’ అని అన్నారు.