Share News

ప్రజలు భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:35 PM

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు.

ప్రజలు భాగస్వాములు కావాలి
ఆదోని: ర్యాలీని ప్రారంభిస్తున్న కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌

కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌

పట్టణంలో స్వర్ణాంధ్రపై ర్యాలీ

ప్రజలతో ప్రతిజ్ఞ

ఆదోని టౌన, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి) : స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీని కమిషనర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

దేవనకొండ: పరిసరాల శుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని పత్తికొండ డీఎల్‌డీవో శివశంకర్‌ అన్నారు. శనివారం దేవనకొండలో జడ్పీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్రజలు తమ పరిధిలోని పరిసరాలలో చెత్త లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శంకరమ్మ, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మద్దికెర: ఆయా గ్రామ పంచాయతీల్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. శనివారం మద్దికెర గ్రామంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన బస్టాండు వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పీడీవో ఉప్పర కృష్ణమూర్తి, పంచాయతీ సిబ్బంది వలి, ప్రదీప్‌, లక్ష్మన్న, జిలాన, రామాంజులు, తదితరులున్నారు.

ఆస్పరి: గ్రామాల్లో తమ పరిసరాలను ప్రతిఒక్కరూ బాధ్యతగా శుభ్రంగా ఉంచుకోవాలని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ గీతావాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైకుంఠం జ్యోతి పాల్గొని గ్రామ సచివాలయం నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద మొక్కలను నాటారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసప్ప, మండల కన్వీనర్లు గోవిందు, అరవింద్‌, రాఘవేంద్ర, సుదర్శన్‌యాదవ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:35 PM