ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:15 PM
కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు.
ఎమ్మెల్యే విరుపాక్షి
ఆలూరులో రిలే దీక్షల విరమణ
ఆదోని జిల్లా కోసం మద్దతు ఇచ్చే పార్టీలకే సపోర్టు
జేఏసీ నాయకులు స్పష్టం
ఆలూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో 61 రోజులుగా చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం విరమించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడును కలిసి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం వినతి పత్రం ఇస్తామని కోరినప్పటికీ పోలీసులు కలవనివ్వకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదోని జిల్లా సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు జేఏసీ నాయకులను తీసుకెళ్లి మద్దతు ఇచ్చేలా జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కోరతామన్నారు. ఆదోని జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానందరెడ్డి, కృష్ణమూర్తి, గోపాల్ ఆచారి మాట్లాడుతూ ఆదోని జిల్లా సాధన కోసం సహకరించే పార్టీలకే ప్రజల మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా సాధన కోసం సీఎం సమావేశంలో లేవనెత్తిన కమతం వెంకటే్‌షను సన్మానించారు. సమావేశంలో జేఏసీ నాయకులు కత్తి రామాంజనేయులు, భూపేష్, ఎల్లప్ప, చంద్రకాంత్‌రెడ్డి, పూల రామాంజనేయులు, కొట్టాల రాజు, పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మారెప్ప, పాల్, ఏసన్న, మాదిగ దాసుల సంఘం జిల్లా అద్యక్షులు దాసరి నరసింహులు, రవి, మాజీ సైనికులు మహేష్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
లడ్డుపై రాజకీయాలు మానుకోండి
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ లడ్డుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే విరుపాక్షి సూచించారు. మంగళవారం ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. కూటమి నేతలు అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. బీజేపీ పార్టీ సైతం ఈ అంశంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు అరికెర వెంకటేశ్వర్లు, సోమశేఖర్, జాన్, శివ, రాజశేఖర్, ఈరన్న, మల్లికార్జున, కొట్టాల రాజు పాల్గొన్నారు.