Share News

వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు ముఖ్యం

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:42 AM

ఈరోజు అమరావతి రైతులు హాయిగా నిద్రపోగలుగుతున్నారని ప్రధానితో భేటీ సందర్భంగా ఆయనకు తాను చెప్పానని లోకేశ్‌ వెల్లడించారు. మీ కృషి, ప్రోత్సాహం వల్లే బిల్లు ఆమోదం పొందిందంటూ 5 కోట్ల...

వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు ముఖ్యం

  • అవి దెబ్బతింటే దేశానికి నష్టం: లోకేశ్‌తో ప్రధాని

ఈరోజు అమరావతి రైతులు హాయిగా నిద్రపోగలుగుతున్నారని ప్రధానితో భేటీ సందర్భంగా ఆయనకు తాను చెప్పానని లోకేశ్‌ వెల్లడించారు. మీ కృషి, ప్రోత్సాహం వల్లే బిల్లు ఆమోదం పొందిందంటూ 5 కోట్ల మంది ఆంధ్రుల తరపున ధన్యవాదాలు తెలిపానన్నారు. మీ సహకారం వల్లే అమరావతి, పోలవరం, గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ వంటి అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘వ్యక్తులు, అధికారం శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థలను మనం పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్లాలి. వ్యవస్థలు దెబ్బతింటే దేశం నష్టపోతుంది. ఇది కరెక్టు కాదు’ అని లోకేశ్‌కు చెప్పారు. ‘భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.. మీరు రావాలని నేను కోరగా.. తప్పనిసరిగా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీరంతా హ్యాపీగా ఉన్నారా అని అడిగారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పాను. 2014లో ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఏపీకి ప్రచారానికి వచ్చినపుడు.. రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ.. బిడ్డను బతికించి తల్లిని చంపేశారని ఆయన అన్నారు. ఇప్పటికీ ఆయన ఆ మాటలను గుర్తుపెట్టుకున్నారు. ఆంధ్ర రాష్ర్టాన్ని సొంతకాళ్లపై నిలబడేవరకు ఆదుకోవాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు టెక్నాలజీలో వెరీ గుడ్‌, ఆయన అనుకుంటే ఏదైనా సాధిస్తారు, ప్రాజెక్టులన్నీ గ్రౌండ్‌ చేస్తే.. దేశానికి తిరిగి మీరు కంట్రిబ్యూట్‌ చేయగలుగుతారని మోదీ చెప్పారు, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతంచేసి ముందుకెళ్లాలని సూచించారు’ అని లోకేశ్‌ వివరించారు.

Updated Date - Apr 03 , 2026 | 06:45 AM