‘పెన్నా’ ఇక నుంచి అంబుజా సిమెంట్స్
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:19 AM
పెన్నా, అంబుజా సిమెంట్స్ విలీనానంతర ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయి. పెన్నా సిమెంట్స్‌ను అంబుజా సిమెంట్స్‌గా పేరు మార్చుకోవడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది.
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పెన్నా, అంబుజా సిమెంట్స్ విలీనానంతర ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయి. పెన్నా సిమెంట్స్‌ను అంబుజా సిమెంట్స్‌గా పేరు మార్చుకోవడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. గురువారం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.యువరాజ్ ఈ ఉత్తర్వు జారీ చేశారు. అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడులో సర్వే నంబరు 78/పీ, 82, 83, 84.92లోని 40.816 ఎకరాల్లో పెన్నా సున్నపురాయి నిక్షేపాలను తవ్వుతోంది. వాటిని ఇప్పటికే అంబుజా సిమెంట్స్‌కు బదిలీ చేశారు.