Share News

పెన్షన్‌దారులకు పెండింగ్‌ డీఏలు చెల్లించాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:30 PM

రాష్ట్రవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగుల పెండింగ్‌ డీఏలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏపీ విశ్రాంతి ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మురారి శంకరప్ప డిమాండ్‌ చేశారు.

పెన్షన్‌దారులకు పెండింగ్‌ డీఏలు చెల్లించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మురారి శంకరప్ప

ఆలూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగుల పెండింగ్‌ డీఏలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏపీ విశ్రాంతి ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మురారి శంకరప్ప డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని మెయిన్‌ స్కూల్‌లో ఆలూరు నియోజకవర్గ అధ్యక్షుడు రామకృష్ణ అధ్యక్షతన విశ్రాంత ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకరప్ప మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా పీఆర్‌సీ, ఐఆర్‌ విడుదల చేయలేదన్నారు. హెల్త్‌ కార్డుల ద్వారా అన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలన్నారు. అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో పెన్షనర్‌ హోంలను నిర్మించాలన్నారు. అనంతరం ఆలూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులుగా రామకృష్ణ, కుమ్మరి గోవిందప్పను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు ఎల్లాగౌడ్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

- సాయిసత్య హాస్పిటల్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు

కర్నూలు సాయిసత్య హాస్పిటల్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. డాక్టర్‌ వై.హరిప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ అరుణ్‌, ఫిజియోథెరపిస్ట్‌లు ఎముకల సాంద్రత పరీక్షలు, బీపీ, షుగర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ మేనేజర్‌ ఇర్ఫాన్‌, నాకియా, ల్యాబ్‌ టెక్నీషియన్‌ స్వాతి పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:30 PM