Share News

రేపల్లెలో రప్పారప్పా...

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:07 AM

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జిగా ఆయన బాధ్యతలు తీసుకుని సరిగ్గా 2 రోజులు కూడా కాలేదు.. అప్పుడే వైసీపీ మార్కు రాజకీయ అలజడి మొదలుపెట్టేశారు.

రేపల్లెలో రప్పారప్పా...

  • టీడీపీ ఫ్లెక్సీలు తొలగిస్తూ పేట్రేగిన వైసీపీ నేత పీటా

  • అడ్డొచ్చిన సీఐ.. అంతు చూస్తానంటూ వార్నింగ్‌

బాపట్ల, రేపల్లె, మార్చి 16(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జిగా ఆయన బాధ్యతలు తీసుకుని సరిగ్గా 2 రోజులు కూడా కాలేదు.. అప్పుడే వైసీపీ మార్కు రాజకీయ అలజడి మొదలుపెట్టేశారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలను తొలగించడం.. రప్పారప్పా నినాదాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం.. అడ్డొచ్చిన సీఐతో వాగ్వాదం.. ఓ దశలో తోపులాట.. ఇలా సోమవారం పీటా నాగమోహనకృష్ణ హడావుడి చేశారు. ఈ నెల 14న రేపల్లె వైసీపీ చాన్‌చార్జిగా పీటా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్యక్రమం ముగిసిన తర్వాత మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. దీనిపై సోమవారం అనుచరులను వెంటేసుకుని ధర్నా నిర్వహించారు. రప్పారప్పా నినాదాలతో ఊరేగింపు తీస్తూ, ఆ దారి లో కనిపించిన టీడీపీ నేతల బ్యానర్లతో పాటు మంత్రి అనగాని ఫ్లెక్సీలను చించివేశారు. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావును పీటా తోసివేయడంతో పా టు అంతుచూస్తానని బెదిరించారు. ఈ ఘటనతో వ్యాపార వర్గాలతోపాటు పట్టణ ప్రజలు కూడా బెంబేలెత్తిపోయారు. ఫ్లెక్సీల తొలగింపు ఘటనపై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 06:08 AM