శాంతి, క్రమశిక్షణతో ఆత్మశుద్ధి
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:03 AM
సమాజంలోని ప్రతి ఒక్కరు శాంతి, సామాజిక బాధ్యత, నైతిక విలువలతో మెలిగినప్పుడే ఆత్మశుద్ధిని పొందగలరని ఢిల్లీకి చెందిన పబ్లిక్ జమాత్ ఽమత గురువు మౌలానా యూస్‌ఫసాడ్ కాందలవి పేర్కొన్నారు.
సమాజంలో అసహనం, చెడు తొలగాలి
యువత నైతిక విలువలతో మెలగాలి
ఇస్లామిక్ మౌలిక విలువలపై ఇస్తేమా బోధనలు
కడప, జనవరి 23(ఆంధ్రజ్యోతి): సమాజంలోని ప్రతి ఒక్కరు శాంతి, సామాజిక బాధ్యత, నైతిక విలువలతో మెలిగినప్పుడే ఆత్మశుద్ధిని పొందగలరని ఢిల్లీకి చెందిన పబ్లిక్ జమాత్ ఽమత గురువు మౌలానా యూస్‌ఫసాడ్ కాందలవి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగర శివారులోని కొప్పర్తిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయస్థాయి ‘పబ్లిక్ జమాత్ దీని ఇస్తేమా’ మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది పాల్గొన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ జుమ్మా ప్రత్యేక నమాజుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌలానా యూస్‌ఫసాడ్ కాందలవి నమాజు అనంతరం ప్రసంగించారు. సమాజ శుద్ధికి ఇస్లామిక్ ఇస్తేమాలు ధార్మిక పిలుపుగా అభివర్ణించారు. ఇస్తేమా ప్రసంగాల్లో దివ్య ఖురాన్, దైవ ప్రవక్త, మహమ్మద్ రసూలుల్లా జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. సమాజంలో అసహనం, చెడు తొలగాలన్నారు. యువత నైతిక విలువలతో మెలగాలని చెప్పారు. పలువురు మత గురువులు కూడా ప్రసంగించారు.