Share News

వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం: పయ్యావుల

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:33 AM

వైసీపీ విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం: పయ్యావుల

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. జగన్‌ ప్రభుత్వం రూ. 9,74,556 కోట్ల అప్పులు చేయగా.. అందులో ఇప్పటికే రూ.24,811 కోట్లు తీర్చామని చెప్పారు. రూ.37 వేల కోట్ల బిల్లులు చెల్లించామని, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రూ.18,700 కోట్ల మేర రాష్ట్ర వాటా నిధులు చెల్లించి వైసీపీ హయాంలో నిలిచిపోయిన 88 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించామని చెప్పారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించామన్నారు. వ్యాపారులపై వేధింపులు లేకుండా పన్నులు వసూలు చేస్తున్నామని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 04:34 AM