ఒక్క ఓటుతో చట్టబద్ధత: పయ్యావుల
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:52 AM
వైసీపీ ఐదేళ్ల విధ్వంసపాలనకు స్వస్తిచెప్పి, కూటమి మీద నమ్మకంతో ప్రజలు వేసిన ఒక్క ఓటు ప్రభావం రాష్ట్ర అభివృద్ధి రూపంలో కనిపిస్తోందని ..
అనంతపురం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల విధ్వంసపాలనకు స్వస్తిచెప్పి, కూటమి మీద నమ్మకంతో ప్రజలు వేసిన ఒక్క ఓటు ప్రభావం రాష్ట్ర అభివృద్ధి రూపంలో కనిపిస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఆ ఒక్క ఓటుతో ఐదుకోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించిందన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానికి చట్టబద్ధతతో ప్రతి ఆంధ్రుడు గర్వపడాలని పయ్యావుల పేర్కొన్నారు.