Share News

యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పవన్‌ తేజ

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:50 AM

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకి చెందిన నూనె పవన్‌ తేజనాయుడు నియమితులయ్యారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర...

యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పవన్‌ తేజ

ఢిల్లీ, గుంటూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకి చెందిన నూనె పవన్‌ తేజనాయుడు నియమితులయ్యారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇటీవల ఆన్‌లైన్‌ పద్ధ్దతిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో 4794 ఓట్లు పోల్‌ అవ్వగా అందులో 2468 ఓట్లు పవన్‌తేజ సాధించారు. అత్యధిక ఓట్లు సాధించటంతో పవన్‌ను యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలానే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గంటా గోపి(పెదకూరపాడు) మురతోటి విజయ్‌కుమార్‌(మైదుకూరు)లను నియమించారు.

Updated Date - Jul 07 , 2026 | 04:50 AM