విద్వేషాలు రెచ్చగొడితే బుద్ధి చెప్తాం: బొలిశెట్టి
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:16 AM
కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వైసీపీని హెచ్చరించారు.
విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వైసీపీని హెచ్చరించారు. కాపు సంఘం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గుంటూరుకు చెందిన దాసరి రాము జనసేన కోసం పనిచేశారన్న అభిమానం తమకు ఉందని, ఆ విలువను పోగొట్టుకోవద్దని హితవు పలికారు. నోటికి వచ్చినట్లు వాగొద్దని అంబటి రాంబాబును హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారు, కూటమి రెండేళ్ల పాలనలో ఏం చేశామో? తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్.. కులం కోసం పార్టీ పెట్టలేదని, అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టారని వివరించారు.