ప్రతి భక్తుడికీ ధార్మిక బాధ్యత ఉంది
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:44 AM
ప్రతి భక్తుడికీ ధార్మిక బాధ్యత ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భగవంతుడి పట్ల భయం, భక్తి ఉన్నా.. ధర్మం అవమానానికి గురైనప్పుడు మౌనంగా ...
మనమంతా ధర్మ పరిరక్షకులుగా మారాలి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రతి భక్తుడికీ ధార్మిక బాధ్యత ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భగవంతుడి పట్ల భయం, భక్తి ఉన్నా.. ధర్మం అవమానానికి గురైనప్పుడు మౌ నంగా ఉండే సగటు హిందూ మనస్తత్వం నుంచి మేల్కొనాల్సిన సమయం వచ్చిందన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో శుక్రవారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘మన దేవుళ్లను అవమానించిప్పుడు లేదా మన ధర్మాన్ని దూషించినప్పుడు బాధపడతాం, కానీ ఆ బాధను మనలోనే దాచుకొని ‘కర్మ చూసుకుంటుంది’ అనుకుంటూ మౌనంగా ముందుకు సాగిపోతున్నాం. ఈ విధానం కచ్చితంగా మారాలి. కులం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్లు కనిపించినా, మనందరి ధర్మం ఒక్కటే. మన హిందూ విశ్వాసాన్ని దురుద్దేశంతో అవమానించిప్పుడు మన ఆవేదనను వ్యక్తీకరించడం అసహనం కాదు, ఆత్మగౌరవం. ఇలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మన సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే’’ అని పవన్ పేర్కొన్నారు.