Share News

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు పవన్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:37 AM

ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి లో శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించారు.

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు పవన్‌కు ఆహ్వానం

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి లో శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ కొట్టే సాయిప్రసాద్‌ నేతృత్వంలో వచ్చిన కమిటీ సభ్యులు బుధవారం మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.

పవన్‌తో రాజేంద్రప్రసాద్‌..

ఉప ముఖ్యమంత్రి పవన్‌ను ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు.

Updated Date - Feb 05 , 2026 | 06:37 AM