ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు: పవన్
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:41 AM
సమస్త జీవజాతులకూ ప్రాణాధారమైన నీటి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు నీటి సంరక్షణకు ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి...
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సమస్త జీవజాతులకూ ప్రాణాధారమైన నీటి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు నీటి సంరక్షణకు ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా జల్‌జీవన్ మిషన్, ఉపాధి హామీ పథకం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నీటి సంరక్షణ, నీటి సరఫరా కార్యక్రమాలు చేపట్టాం. సుస్థిర నీటి వనరుల అభివృద్ధి నుంచి సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తు అవసరాలకు నీటి భద్రతను కల్పిస్తాయి’ అని పవన్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. ప్రతి నీటి బొట్టునూ సంరక్షిద్దాం-మన భవిష్యత్తును రక్షిద్దాం అని ప్రతినబూనాలని పవన్ పిలుపునిచ్చారు.