Share News

రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివి: పవన్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:49 AM

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివి: పవన్‌

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇవి రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలని బుధవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారు. అమరావతికి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని మోదీకి, కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో భావితరాల అభివృద్ధికి అమరావతి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది’ అని పవన్‌ తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 04:49 AM