Share News

నియోజకవర్గాల పునర్విభజన, స్థానిక ఎన్నికలపై అధ్యయనానికి జనసేన కమిటీ

ABN , Publish Date - May 07 , 2026 | 03:36 AM

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పార్టీకి నివేదిక ఇవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ బుధవారం కమిటీని నియమించారు.

నియోజకవర్గాల పునర్విభజన, స్థానిక ఎన్నికలపై అధ్యయనానికి జనసేన కమిటీ

  • ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో ఏర్పాటు

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పార్టీకి నివేదిక ఇవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ బుధవారం కమిటీని నియమించారు. ఈ కమిటీలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వంశీకృష్ణను నియమించారు. అలాగే సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కొటికలపూడి గోవిందరావును కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. వీరికి పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ త్వరలో దిశానిర్ధేశం చేయనున్నారు.

Updated Date - May 07 , 2026 | 03:36 AM